ITR Filing | ఐటీ రిటర్నుల దాఖలుకు సూచనలు, మార్గదర్శక వీడియో విడుదల
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల (ITR) దాఖలుదల ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 15 వరకు తుది గడువు ఉన్నందున, ప్రస్తుతానికి ఈ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది.
ఐటీఆర్ దాఖలు విషయంలో సరైన అవగాహన లేకపోవడం, లేదా నిపుణుల సహాయం లేనప్పుడు కొంతమంది పన్నుదాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మొదటిసారి ఐటీఆర్ ఫైల్ చేస్తున్నవారి కోసం, వారికి సులభంగా మార్గనిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ఆదాయ పన్ను శాఖ ITR-1 ఫైలింగ్‌కు సంబంధించి ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.
ఈ వీడియోలో ప్రతి స్టెప్‌ను స్క్రీన్‌షాట్లతో సహా క్లియర్‌గా చూపిస్తూ, ఎవరైనా సులభంగా అర్థం చేసుకోగలిగేలా వివరించారు.
ఈ సందర్భంగా పన్ను శాఖ ఒక విజ్ఞప్తి చేసింది — చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, ముందుగానే రిటర్నులు దాఖలు చేయాలని కోరింది. అలాగే, ఫైలింగ్ ప్రక్రియను సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేసుకోవాలని సూచించింది.
ఆదాయ పన్ను శాఖ విడుదల చేసిన మార్గదర్శక వీడియో మీ కోసమే...