08-08-2025
కర్ణాటకలోని ధర్మస్థలికి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో ఈ కథ జరుగుతుంది. ఆ గ్రామానికి చెందిన అశోక్ ఒక పెళ్లి వేడుక ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అవుతాడు. మార్గమధ్యంలో తన ప్రేమించిన అమ్మాయి ఇంటి దగ్గర ఆగుతాడు. అప్పుడే ఆ ఇంటి బాత్రూంలోనుంచి ఆమె మాటలు వినిపించడంతో, దొంగతనంగా ఆమెను చూడాలని ప్రయత్నిస్తాడు.
కానీ ఈ క్రమంలో, అశోక్ చేసిన పనిని ఇద్దరు వ్యక్తులు గుర్తించి అతడిని పట్టేస్తారు. తాను తప్పించుకోవడానికి దెయ్యం పట్టినట్టుగా నటిస్తాడు. కానీ ఉదయం వరకూ ఆ వార్త ఊరంతా పాకిపోతుంది — “అశోక్‌కి నిజంగానే దెయ్యం పట్టింది” అని.
ఆ దెయ్యాన్ని వదిలించేందుకు గ్రామ పెద్ద రవన్న, సిటీ నుంచి కరుణాజీ స్వామీజీ ని పిలిపిస్తాడు. నిజంగా అశోక్‌కి దెయ్యం పట్టిందా? కరుణాజీ స్వామీజీ అతడిని ఎలా విముక్తి చేశాడు? అశోక్ దెయ్యం హంగామా వల్ల గ్రామం ఏం .... ?
Tags:
Movies