టీఎస్‌ఎస్పీడీసీఎల్ (TSSPDCL) విద్యుత్ బిల్లు పేరుమార్పు ఆన్‌లైన్‌లో ఎలా చేయాలి?

టీఎస్‌ఎస్పీడీసీఎల్ (TSSPDCL) విద్యుత్ బిల్లు పేరుమార్పు ఆన్‌లైన్‌లో ఎలా చేయాలి?



హైదరాబాద్‌లో ఇల్లు కొనుగోలు చేసిన వారు లేదా యజమాని మారిన వారు విద్యుత్ బిల్లులో పేరును మార్చుకోవడం చాలా అవసరం. విద్యుత్, గ్యాస్ బిల్లులు వంటి యుటిలిటీ బిల్లులు యజమాని పేరుతో ఉండటం భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు రాకుండా కాపాడుతుంది. చాలా మంది ఏజెంట్లకు డబ్బులు ఖర్చు చేస్తూ పేరుమార్పు చేస్తారు. కానీ ఇప్పుడు కేవలం ₹25 ఫీజుతో మీరు ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.


విద్యుత్ బిల్లులో పేరుమార్పు ఆన్‌లైన్‌లో – ముఖ్య సమాచారం

  • అధికారిక వెబ్‌సైట్: TSSPDCL
  • సేవ రుసుము: ₹25 మాత్రమే
  • అవసరమైన డాక్యుమెంట్లు: రిజిస్టర్డ్ సేల్ డీడ్ / గిఫ్ట్ డీడ్, ఐడీ ప్రూఫ్, ఇండెమ్నిటీ బాండ్
  • ఏజెంట్ల సహాయం అవసరం లేదు
  • డాక్యుమెంట్లు స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి

ఎవరు పేరుమార్పు చేసుకోవచ్చు?

  1. కొత్త ఇల్లు/ఫ్లాట్ కొనుగోలు చేసినవారు – సేల్ డీడ్ ఆధారంగా పేరు మార్చుకోవచ్చు.
  2. భార్యాభర్తల సంయుక్త యాజమాన్యం – భర్త లేదా భార్య ఎవరి పేరుకైనా బిల్లు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. మరొకరి నుండి ₹10 స్టాంప్ పేపర్‌పై NOC ఇవ్వాలి.
  3. ఇల్లు యజమాని మరణించిన సందర్భంలో – మరణ ధృవీకరణ పత్రం (Death Certificate) మరియు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సమర్పించాలి.

అవసరమైన డాక్యుమెంట్లు

  1. రిజిస్టర్డ్ సేల్ డీడ్ లేదా గిఫ్ట్ డీడ్ – PDF, 5MB లోపు
  2. వ్యక్తిగత ఐడీ ప్రూఫ్ – JPG/JPEG, 100KB లోపు
  3. ఇండెమ్నిటీ బాండ్ – ₹100 స్టాంప్ పేపర్‌పై, PDF, 500KB లోపు

    • అధికారిక వెబ్‌సైట్‌లో ఫార్మాట్ అందుబాటులో ఉంటుంది.

గమనిక: అన్ని డాక్యుమెంట్లు సంతకంతో (signed) స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. సంతకం లేని పత్రాలు తిరస్కరించబడతాయి.


విద్యుత్ బిల్లులో పేరు మార్పు ఆన్‌లైన్‌లో చేసుకునే విధానం

  1. టీఎస్‌ఎస్పీడీసీఎల్ అధికారిక వెబ్‌సైట్ TSSPDCL ను ఓపెన్ చేయండి.
  2. Consumer Service → Consumer Service Request లోకి వెళ్ళండి.
  3. మీ విద్యుత్ బిల్లులో ఉన్న Service Number మరియు మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి.
  4. OTP వస్తుంది, దాన్ని ఎంటర్ చేయండి.
  5. అందుబాటులో ఉన్న సర్వీసుల్లో Title Transfer ఎంపిక చేయండి.
  6. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
  7. ₹25 ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించండి.

ఇంతటితో మీ అప్లికేషన్ పూర్తవుతుంది.



Previous Post Next Post